Mr. Work From home | విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆధునిక సాఫ్ట్వేర్ జీవనశైలికి మరియు గ్రామీణ మూలాలైన వ్యవసాయానికి మధ్య ఉన్న సంబంధాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించనుంది. సిటీలో సెటిల్ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే తన ఊరిలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే యువకుడి కథా నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. ముఖ్యంగా “వ్యవసాయం చేసే విధానం మారితే, దాన్ని చూసే తీరు మారుతుంది” వంటి డైలాగులు ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించగా, అనీష్ కురువిల్లా, శివాజీ రాజా ఇతర కీలక పాత్రలు పోషించారు. బాబా సెహగల్ పాడిన సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా, చిన్న సినిమాల పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయని హీరో త్రిగుణ్ ధీమా వ్యక్తం చేశారు. తక్కువ టికెట్ ధరలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.