Trigun | ఈషా ఫేం త్రిగుణ్ మరియు పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో, లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సినిమా విశేషాలను పంచుకున్నారు.
నిర్మాత అరవింద్ మండెం మాట్లాడుతూ, ఈ సినిమా చాలా క్రియేటివ్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుందని, పాయల్ మరియు త్రిగుణ్ అద్భుతమైన టీమ్‌వర్క్‌తో దీనిని పూర్తి చేశారని తెలిపారు. ముఖ్యంగా విజువల్స్, మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయని, ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా మలిచామని పేర్కొన్నారు. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ముత్యాల రామ్ దాస్ గారి సపోర్ట్‌తో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించి హిట్ చేయాలని కోరారు.
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. దాసరి గారు “ప్రేక్షక దేవుళ్లు” అనేవారు. ఆయన ఎందుకు అలా అనేవారో ఈ రోజు అర్థమైంది. ప్రేక్షకులు కనికరిస్తేనే సినిమా ప్రాణం పోసుకుంటుంది. ఈ సినిమా మనం రోజువారీగా చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా ఉంటుంది. అలాగే ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమకథలోని కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రామ్ దాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేయడం మా నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఈ సినిమా సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ కూడా నిజ జీవితానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బలంగా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అద్భుతంగా నటించారు. పాయల్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారు. త్రిగుణ్ నా ఫస్ట్ హీరో. తనని ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని తెలిపారు.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. వరుసగా ఇక్కడ సినిమాలు రావడం, తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం ఆనందంగా ఉంది. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చాలా మంచి సినిమా తీసుకొస్తున్నాం. మే 15న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్లో సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. పాయల్ లక్ ఈ సినిమాకి కలిసి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.
డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ.. ‘ఈషా’తో విజయాన్ని అందుకున్న త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’తో మంచి ప్రశంసలు అందుకున్న పాయల్ రాధాకృష్ణ ఈ చిత్రంలో చాలా చక్కగా నటించారు. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇందులో కూడా అలాంటి మంచి కాన్సెప్ట్ ఉంది. నిర్మాత అరవింద్ చాలా మంచి ప్యాషన్‌తో నిర్మించారు. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.