‘మోగ్లీ’ ప్రేమపోరాటం
యువహీరో రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘మోగ్లీ 2025’. ‘కలర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యువహీరో రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘మోగ్లీ 2025’. ‘కలర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
డిసెంబర్ 12న ఈ సినిమాను విడుదల కానున్నది. ఇప్పటికే హీరో నాని వాయిస్‌ఓవర్‌తో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చిందని, తన ప్రేమను రక్షించుకోవడానికి ఎంతదూరమైన వెళ్లే యువకుడిగా రోషన్ కనకాల పాత్ర శక్తివంతగా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. బండి సరోజ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హర్ష చెముడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి ఎం., సంగీతం: కాలభైరవ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

