Blood Roses | మూవీ రివ్యూ: ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజెస్’
Blood Roses | టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మించిన చిత్రం 'బ్లడ్ రోజెస్'.
Blood Roses | టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మించిన చిత్రం ‘బ్లడ్ రోజెస్’. ఎం.జి.ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రోజే (ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ
హైదరాబాద్ నగర రాజకీయాల్లో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. తమ కొడుకులను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టి వారసత్వాన్ని కొనసాగించాలని వారు భావిస్తారు. అయితే, ఇదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరగడం కలకలం రేపుతుంది. ఈ హత్యలకు దేవి దాస్ కుమారుడు మదన్‌కు సంబంధం ఉందని వార్తలు రావడంతో రాజకీయం వేడెక్కుతుంది. తన కొడుకు రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి భజరంగి దాస్ వేసిన ప్లాన్ ఇదని దేవి దాస్ వర్గీయులు ఆందోళనకు దిగుతారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ గోగోయ్ (ధర్మ కీర్తి రాజు) తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని చివరకు సస్పెండ్ అవుతాడు. ఈ క్రమంలో కేసు సీబీఐకి వెళ్లే తరుణంలో, పోలీస్ కమిషనర్ హోమ్ మినిస్టర్‌ను ఒప్పించి ‘అధిర’ (అప్సర రాణి) రంగంలోకి దింపుతారు. అసలు ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? అధిర ఈ మిస్టరీని ఎలా ఛేదించింది? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
మహిళా సాధికారతను చాటిచెబుతూ, సమాజంలో స్త్రీలు ఎంత బలంగా ఉండాలో ఈ సినిమా చూపిస్తుంది. “ప్రేమించవచ్చు.. కానీ ప్రేమిస్తే మోసం చేయకూడదు” అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తూనే, ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఎం.జి.ఆర్ ఈ చిత్రాన్ని మలిచారు. 2026లో వస్తున్న విభిన్న కథా చిత్రాల జాబితాలో ‘బ్లడ్ రోజెస్’ కచ్చితంగా నిలుస్తుంది.
నటీనటుల పనితీరు:
అధిర పాత్రలో అప్సర రాణి లుక్ మరియు నటన అద్భుతంగా ఉన్నాయి. ఆమె కెరీర్లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. శాండల్‌వుడ్ నటుడు ధర్మ కీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన గత చిత్రాల కంటే ఈ సినిమాలో నటన ఎంతో పరిణతితో ఉంది. మార్టిన్ క్యారెక్టర్లో క్రాంతి కిల్లి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్తో సమానంగా ఆయన పాత్ర ప్రయాణిస్తుంది. జనని పాత్రలో నటించిన శ్రీలు పృథ్వీరాజ్ హంతకుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు ఎం.జి.ఆర్ కథ, మాటలు మరియు స్క్రీన్‌ప్లేను పక్కాగా రాసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవంతో, తెలుగులో తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
అప్సర రాణి, ధర్మ కీర్తి రాజుల నటన.
ఉత్కంఠ రేకెత్తించే సెకండాఫ్.
సమాజానికి ఇచ్చే మంచి సందేశం.
తీర్పు:
మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక సందేశం ఉన్న ‘బ్లడ్ రోజెస్’ సినిమాను కుటుంబ సమేతంగా చూడవచ్చు. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ కథలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.
రేటింగ్: 2.75/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

