స్ఫూర్తినిచ్చిన విజయమిది

‘రెండేళ్ల కష్టాన్ని మరిపించిన విజయమిది. మంచి సినిమా చేశామని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు’ అని అన్నారు సుమంత్ అశ్విన్. శ్రీకాంత్తో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకుడు. మహేష్ నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత ఈ సినిమాతో నాకు చక్కటి విజయం దక్కింది. కథ, పాత్రలతో పాటు లొకేషన్స్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు’ అని చెప్పారు. భవిష్యత్తులో మంచి కథల్ని ఎంచుకునేలా ఈ విజయం స్ఫూర్తినిచ్చిందని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు. ‘యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా’ అని దర్శకుడు అన్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ప్రయోగాత్మకంగా తాము చేసిన సినిమా ఇదని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Srikanth
- Sumanth ashwin
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

