Mosagallaku Mosagadu Movie | 52 వసంతాలు పూర్తి చేసుకున్న మోసగాళ్లకు మోసగాడు.. తొలి పాన్ వరల్డ్ సినిమా ఇదే..!
Super Star Krishna | ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఫర్ ఏ ఫ్యూ డాల్లర్స్’ మోర్ వంటి ఇంగ్లీష్ సినిమాలు అప్పట్లో మద్రాస్‌లో మంచి కలెక్షన్లు సాధించాయి. దాంతో కృష్ణ మనం కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని భావించాడు.
Super Star Krishna | ఇప్పుడు మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ సూపర్ స్టార్ కృష్ణ 52ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణ హీరోగా నటించిన మొసగాళ్లకు మోసగాడు సినిమాకు కే.ఎస్.ఆర్ దాస్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా 52వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా వెనుక కథనాలేంటో ఓ లుక్కేద్దాం.
‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఫర్ ఏ ఫ్యూ డాల్లర్స్’ మోర్ వంటి ఇంగ్లీష్ సినిమాలు అప్పట్లో మద్రాస్‌లో మంచి కలెక్షన్లు సాధించాయి. దాంతో కృష్ణ మనం కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని భావించాడు. అనుకున్నదే తడువుగా రచయిత ఆరుద్ర గారిని పిలిచి తెలుగు నేటీవిటీకి తగ్గట్లు కథ రాయమని చెప్పారు. ‘ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ’ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్తో ఆరుద్ర ఈ సినిమా కథను రాశారు.
కృష్ణ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయ స్టూడీయోస్‌పై ఈ సినిమాను నిర్మించాడు. అప్పట్లోనే ఈ చిత్రానికి రూ.8 లక్షల బడ్జెట్ అయింది. మొదట ఈ సినిమాకు అదృష్ట రేఖ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే ఈ సినిమాకు ఆ పేరు అంతగా బాగాలేదని అనుకుని మోసగాళ్ళకు మోసగాడు అనే పేరును పెట్టారు. 1971 ఆగస్టు 27లో తొలి తెలుగు కౌబాయ్ చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 50లక్షల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత 50లక్షల గ్రాస్ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచాడు. ఈ చిత్రం తమిళంలో ‘మొసక్కరనుక్కు మొసక్కరన్’, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు అనూహ్య స్పందన రావడంతో, కృష్ణ ఈ సినిమా నిడివిని తగ్గించి ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజ్ చేశాడు. అక్కడ కూడా ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్‌కు డబ్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది.
సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా మే 31న ఈ సినిమా 4K ప్రింట్‌తో రిలీజైంది. ఇక అప్పటి సినిమాల థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం జనాలు ఓ సారి చూసోద్దాం అని వెళ్లారు. రీ-రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు విశేష స్పందన వచ్చింది. కొత్త సినిమా రేంజ్లో థియేటర్లు దద్దరిల్లాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

