Sheraz Mehdi | చిన్న సినిమాలకు అన్యాయం చేస్తే ఊరుకోం.. దర్శకుడు షెరాజ్ మెహదీ!
Sheraz Mehdi | హైదరాబాద్ నగరంలో ‘బాద్మాష్ పొట్టే’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు, కథానాయకుడు షెరాజ్ మెహదీ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న గుత్తాధిపత్యం, బంధుప్రీతి మరియు చిన్న నిర్మాతలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో ‘బాద్మాష్ పొట్టే’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు, కథానాయకుడు షెరాజ్ మెహదీ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న గుత్తాధిపత్యం, బంధుప్రీతి మరియు చిన్న నిర్మాతలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నరగా తాను ఈ అంశాలపై పోరాటం చేస్తున్నానని వెల్లడించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు, ఫిల్మ్ చాంబర్‌కు కూడా తుది నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తన పోరాటం దాదాపు తొంబై శాతం పూర్తయిందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సినిమా రంగంలో కొందరి ఆధిపత్యం కారణంగా కొత్తవారికి, ప్రతిభావంతులకు తగిన అవకాశాలు దక్కడం లేదని షెరాజ్ మెహదీ విమర్శించారు. నిర్మాతలు కేవలం వ్యాపార ధోరణితో కాకుండా ప్యాషన్‌తో సినిమాలు తీయాలని సూచించారు. తెలంగాణలో తెలుగు సినిమాలతో పాటు హైదరాబాద్ కేంద్రంగా రూపొందుతున్న స్థానిక చిత్రాలకు కూడా ప్రభుత్వ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత నష్టాలు వస్తే కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు రికవరీ అయ్యేలా సబ్సిడీ విధానం ఉండాలని ఆకాంక్షించారు.
దర్శకుడు ఫరూఖ్ ఖాన్ రూపొందించిన ‘బాద్మాష్ పొట్టే’ చిత్రంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఫరూఖ్ ఖాన్ ప్యాషన్ తనకు ఎంతో నచ్చిందని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా తెరకెక్కుతున్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్‌లోని సెవెన్ లేక్ వ్యూ హోటల్లో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

