Hridayapoorvam Teaser | నవ్వులు పంచుతున్న మోహన్ లాల్ ‘హృదయపూర్వం’ టీజర్
Hridayapoorvam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam). ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
Hridayapoorvam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam). ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఎల్2: ఎంపురాన్’ మరియు ‘తుడరుమ్’ వంటి యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న లల్లెట్టన్ హృదయపూర్వం అంటూ క్రేజీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తుండగా మోహన్ లాల్ సరసన మాళవిక మోహనన్ నటించారు. ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే ఈ తాజాగా ఈ టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
ఈ టీజర్ ఒక ఫన్నీ మూమెంట్‌తో స్టార్ట్ అవుతుంది. ఒక యువకుడు మోహన్ లాల్ పాత్రతో మాట్లాడుతూ, తాను మలయాళ చిత్రాలకు పెద్ద అభిమాని అని, ముఖ్యంగా ఫహద్ ఫాసిల్ (ఫాఫా) అంటే తనకు చాలా ఇష్టమని చెబుతాడు. దానికి మోహన్ లాల్, “ఆయన మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సీనియర్ నటులు ఉన్నారు” అని అనగా, ఆ యువకుడు “కాదు కాదు, ఫాఫానే బెస్ట్!” అని చెప్పడం నవ్వులు పూయిస్తుంది. ఇది ప్రస్తుత సినీ ట్రెండ్‌ను, తారల మధ్య ఉండే స్నేహపూర్వక పోటీని చమత్కారంగా ప్రతిబింబిస్తుంది. మోహన్ లాల్ తన సహజమైన హాస్యంతో, అలరించే నటనతో టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రం ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

