Mithun Chakraborty | నిలకడగానే మిథున్ చక్రవర్తి ఆరోగ్యం
ప్రముఖ బాలీవుడ్ నటుడు, భజాపా నేత మిథున్ చక్రవర్తి తీవ్ర ఆస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం ఆయనకు హటాత్తుగా కుడిచేయి, కుడికాలు బలహీనపడటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Mithun Chakraborty | ప్రముఖ బాలీవుడ్ నటుడు, భజాపా నేత మిథున్ చక్రవర్తి తీవ్ర ఆస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం ఆయనకు హటాత్తుగా కుడిచేయి, కుడికాలు బలహీనపడటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిథున్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ ప్రకారం మిథున్ మెదడులో ఇస్కిమిక్ సెరెబ్రో వాస్కులర్ అనే స్ట్రోక్ ఏర్పడిందని, ఈ కారణం వల్లే ఆయన కుడి చేయి, కుడి కాలు బలహీనపడ్డాయని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం మిథున్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్యులు తెలియజేశారు. 1976లో ‘మ్రిగయా’ అనే బెంగాలీ చిత్రం ద్వారా మిథున్ తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే ఉత్తమనటుడిగా పలు అవార్డులు అందుకున్నారు. 1982లో విడుదలైన ‘డిస్కోడాన్సర్’ ఆయనకు సూపర్స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు మిథున్చక్రవర్తి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

