Mission Raniganj | ఓటీటీలోకి వచ్చేస్తున్న అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Mission Raniganj | ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్లో చాలా రోజులకు హిట్ కొట్టాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఆయన తాజాగా నటించిన చిత్రం మిషన్ రాణిగంజ్(Mission Raniganj).
Mission Raniganj | ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్లో చాలా రోజులకు హిట్ కొట్టాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఆయన తాజాగా నటించిన చిత్రం మిషన్ రాణిగంజ్(Mission Raniganj). ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక (The Great Bharat Rescue). బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (parinithi chopra) కథానాయికగా నటించింది. అయితే అక్టోబర్ 06న విడుదలైన ఈ చిత్రం అక్షయ్ కుమార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఒకప్పుడు వంద కోట్లను అవలీలగా కొట్టేసిన అక్షయ్.. ఈ సినిమాతో కనీసం రూ.10 కోట్లు కూడా కొట్టలేకపోయాడు. పైగా అప్పుడు పోటీగా పెద్ద సినిమాలు కూడా ఏవి లేవు. అయినా కానీ ఇంత చెత్తగా పర్ఫార్మ్ చేసిందంటే జనాలు ఈ సినిమాను ఏ రేంజ్లో తిప్పికొట్టారో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా డిసెంబర్ 01న నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్పెషల్ 26, రుస్తుం వంటి సినిమాలు తెరకెక్కించిన టీను సురేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పూజా ఎంటర్టైనమెంట్స్తో కలిసి అక్షయ్ కుమార్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ఉన్న బొగ్గు గనుల్లో 64 మంది కార్మికులు చిక్కుకుంటారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించాడు. వారిని కాపాడడానికి అక్షయ్ ఎలాంటి సాహసాలు చేశాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.
Hindi movie #MissionRaniganj digital arrives December 1 on Netflix.
Starring – Akshay Kumar, Parineeti Chopra, Kumud Mishra, Varun Badola, Rajesh Sharma, Ananth Mahadevan, Pavan Malhotra, Ravi Kishan & Jameel Khan. pic.twitter.com/QJ1ujPY7ka
— Ott Updates (@Ott_updates) November 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

