Mishan Impossible promotional video | డైరెక్టర్ల ఇంటింటికి తిరిగి ప్రమోషన్స్ కోసం కష్టాలు..వీడియో వైరల్
ప్రస్తుతం బాలీవుడ్ నటి తాప్సీ (Taapsee Pannu) పన్ను ప్రధాన పాత్రలో మిషన్ ఇంపాజిబల్ (Mishan Impossible) సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ ). ఈ చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా షురూ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది స్వరూప్ టీం.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Agent Sai Srinivasa Athreya) సినిమాతో సాలిడ్ హిట్టు అందుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ ). ఈ దర్శకుడు ప్రస్తుతం బాలీవుడ్ నటి తాప్సీ (Taapsee Pannu) పన్ను ప్రధాన పాత్రలో మిషన్ ఇంపాజిబల్ (Mishan Impossible) సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా షురూ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది స్వరూప్ టీం. సినిమాలో కీ రోల్స్ చేస్తున్న హర్ష చెముడు, హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ముగ్గురు సినిమా ప్రమోషన్స్ కోసం హర్ష దగ్గరకు వెళ్తే ఓ సలహా ఇస్తాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి డైరెక్టర్లు తరుణ్ భాస్కర్, భరత్ కమ్మ, వివేక్ ఆత్రేయ, సందీప్ రాజ్, వినోద్ అనంతోజు, వెంకటేశ్ లను కలిసి ప్రమోట్ చేయాలని కోరతారు. అయితే సినిమా టైటిల్లో స్పెల్లింగ్ తప్పుందని డైరెక్టర్లు ప్రమోట్ చేయలేమని చెప్తారు. ఇక ఫైనల్‌గా చేసేదేమిలేక ముగ్గురు కలిసి మళ్లీ హర్ష దగ్గరకొస్తారు.
అందరూ అవమానించారన్నా వాళ్లు చెప్పగానే..అన్న చెప్పినట్టుగానే ఆ ఎమోషన్ మన ప్రమోషన్‌కు వాడి ట్రైలర్‌ను రిలీజ్ చేద్దామనుకుంటారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి స్వరూప్ ఆర్ఎస్జే ట్రైలర్ లాంఛింగ్‌కు ముందే తన సినిమాను కొత్తగా పబ్లిసిటీ చేస్తూ ఎంతోమంది కొత్త దర్శకుల్లో జోష్ నింపుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

