Mirzapur: The Movie | వెబ్ సిరీస్‌గా ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సంపాదించుకున్న ‘మీర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై కూడా అదే జోరును ప్రదర్శిస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మీర్జాపూర్: ది మూవి’ సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఓపెనింగ్స్ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ చిత్రం తొలి రోజు భారతదేశంలో సుమారు రూ. 24.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ ద్వారా రూ. 24.60 కోట్లు రాగా, తెలుగు వెర్షన్ ద్వారా దాదాపు రూ. 15 లక్షలు వచ్చాయి. ఇక ఈ సినిమా తొలి రోజు గ్రాస్ వసూళ్లు రూ. 29.70 కోట్లను దాటాయి. ఈ బలమైన ఓపెనింగ్‌తో ‘మీర్జాపూర్: ది మూవి’ 2026 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో వచ్చిన ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’ సినిమా తొలి రోజు రూ. 22 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, మీర్జాపూర్ ఆ రికార్డును వెనక్కి నెట్టింది. అయితే, రూ. 30 కోట్ల ఓపెనింగ్‌తో మూడో స్థానంలో ఉన్న ‘బోర్డర్ 2’ చిత్రానికి ఇది స్వల్ప దూరంలో నిలిచింది. ఇక ‘టాక్సిక్’, ‘ధురంధర్ ది రివెంజ్’ సినిమాలు వరుసగా రూ. 55 కోట్లు, రూ. 99 కోట్ల తొలి రోజు వసూళ్లతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.