బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో మిల్కీబ్యూటీ తమన్నా ప్రేమాయణం సాగిస్తున్నదని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ బంధంపై ఈ జంట ఎక్కడా పెదవి విప్పలేదు. ముంబయిలో జరిగే పలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో ఈ జంట సందడి చేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్‌వర్మతో తన రిలేషన్‌పై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది తమన్నా. విజయ్ వర్మ కేవలం సహ నటుడు మాత్రమే కాదని, ఇద్దరి మధ్య ఆత్మీయ బంధం ఉందని చెప్పింది.
కెరీర్లో ఎందరో హీరోలతో కలిసి నటించినా..విజయ్ మాత్రం చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని తమన్నా ప్రశంసలు కురిపించింది. ఆమె మాట్లాడుతూ ‘విజయ్ సమక్షంలో నేను చాలా సంతోషంగా ఉంటాను. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా ఉంటాడనే నమ్మకం ఉంది. ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బందులొస్తే విజయ్‌వర్మ నాకు రక్షణకవచంగా నిలుస్తాడు. నా వ్యక్తిత్వాన్ని నిజాయితీగా అర్థం చేసుకున్న వ్యక్తి అతను’ అని చెప్పుకొచ్చింది. తాజా వ్యాఖ్యలతో తన ప్రేమ వ్యవహారాన్ని తమన్నా కన్ఫర్మ్ చేసిందని అభిమానులు అనుకుంటున్నారు.