Michael | సందీప్ కిషన్ కెరీర్లో మైఖేల్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?
రంజిత్ జయకోడి దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ లవ్ ట్రాక్ నేపథ్యంలో తెరకెక్కిన మైఖేల్ (Michael) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. సందీప్ కిషన్ (Sundeep Kishan) కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోనుంది మైఖేల్..
రెండు రోజుల క్రితం మైఖేల్ (Michael) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan).
రంజిత్ జయకోడి దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ లవ్ ట్రాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. కాగా సందీప్ కిషన్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోనుంది మైఖేల్. ఇంతకీ అంత స్పెషల్ ఏంటనుకుంటున్నారా..?
మైఖేల్ పీఆర్ టీం ప్రకారం ఓపెనింగ్ డేన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 4.60 కోట్లు రాబట్టింది. ఈ వసూళ్లతో సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా మైఖేల్ నిలిచింది. కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు మైఖేల్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్లడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓపెనింగ్ రోజే సందీప్ కిషన్ కు స్పెషల్ గిఫ్ట్ అందించిన మైఖేల్.. రాబోయే రోజుల్లో నిర్మాతలకు ఎలాంటి కలెక్షన్లు తెచ్చిపెడుతుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
మైఖేల్‌లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మైఖేల్ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు. దివ్యాంక కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 3న గ్రాండ్‌గా విడుదలైంది మైఖేల్.
మైఖేల్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

