Shah Rukh Khan – Met Gala 2025 | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రతిష్ఠాత్మక మెట్ గాలాలో అడుగు పెట్టనున్నారు. సోమవారం (మే 5న) న్యూయార్క్‌లోని మెట్ ఫిఫ్త్ అవెన్యూ, ఐరిస్ అండ్ బి. గెరాల్డ్ కాంటర్ ఎగ్జిబిషన్ హాల్లో జరగనున్న ఈ వేడుక కోసం షారుఖ్ న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఆయన తన మేనేజర్ పూజా దడ్లానీతో కలిసి జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో షారుఖ్ తన సూట్‌కేస్‌ను తానే లాగుతూ కనిపించారు. ఇద్దరు కస్టమ్స్ అధికారులు ఆయన వెంట ఉన్నారు. గ్రే జాకెట్, జీన్స్, సన్‌గ్లాసెస్‌తో పాటు తెల్ల టీ-షర్ట్‌లో షారుఖ్ కనిపించారు. ఆయన వెంట తక్కువ సామాను మాత్రమే ఉండటం, పెద్దగా సహాయక సిబ్బంది ఎవరూ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే షారుక్ టీమ్ తర్వాత రాబోతుందని సమాచారం. మరోవైపు షారుఖ్ మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై సబ్యసాచి రూపొందించిన దుస్తులను ధరించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం ప్రముఖ ఫ్యాషన్ వేదిక డైట్ సబ్య ఈ విషయాన్ని వెల్లడించింది.
Our team member from USA @msgreenjesss couldn’t hold her excitement on meeting King Khan at the airport. Her love says it all, and his gentle, respectful greeting shows just how big-hearted he truly is! 🖤@iamsrk @pooja_dadlani #ShahRukhKhan #KingKhan #SRK #King #MetGala2025… pic.twitter.com/ShAi4Tg72H
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) May 3, 2025