అల్లు అర్జున్-అర్మాన్ మాలిక్ (Armaan Malik) కాంబినేషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పాట బుట్టబొమ్మా (Butta Bomma). అల వైకుంఠపురంలో సినిమాలో వచ్చే ఈ సాంగ్ ఏ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి కలయిక రిపీట్ అయితే ఎలా ఉంటుంది…మరో బ్లాక్ బాస్టర్ హిట్టు పడ్డట్టే. అవును అభిమానుల కళ నిజమైంది. బన్నీ-అర్మాన్ మాలిక్ మరో సాంగ్‌తో వచ్చేశారు.
ఈ సారి సినిమా కోసం కాదండోయ్. కోకా కోలా బ్రాండ్ (Coca Cola) కోసం అర్మాన్ మాలిక్ పాడిన ప్రైవేట్ సాంగ్‌లో స్టైలిష్ డ్యాన్స్ తో ఇరగదీశాడు బన్నీ. మేము ఆగము (Memu Aagamu)..ట్రాక్‌తో వస్తున్న ఈ పాటను లాస్ట్ స్టోరీస్ అండ్ ఎల్లీ కంపోజ్ చేశారు. పాపులర్ సౌత్ కొరియన్ గాళ్ ట్రిబె కూడా ఈ సాంగ్‌లో మెరిసింది. బన్నీ ఎనర్జిటిక్ డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు.
మరోవైపు పుష్ప..ది రూల్ షూటింగ్ ఇవాళ మొదలైంది. త్వరలోనే షూట్లో జాయిన్ కానున్నాడు బన్నీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ డైరెక్టర్ కాగా..కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో పుష్ప..ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోంది సీక్వెల్ పార్టు.