Meher Ramesh | మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె మోహన వివాహం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్‌తో మోహన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇటీవల ఐటీసీ కోహినూర్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించగా, ఇప్పుడు వివాహ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, విక్టరీ వెంకటేష్, దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, వీర శంకర్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ఏఎం రత్నం, సి. అశ్వినీదత్, కోన వెంకట్, బీవీఎస్ రవి, నటుడు మురళీమోహన్, యాంకర్ సుమ తదితరులు వేడుకలో సందడి చేశారు.
అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అంబటి రాంబాబు వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెహర్ రమేష్‌కు మెగా కుటుంబంతో ప్రత్యేకమైన బంధుత్వం ఉంది. చిరంజీవి తల్లి అంజనా దేవి, మెహర్ రమేష్ తల్లి సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో చిన్నప్పటి నుంచే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో ఆయనకు సన్నిహిత అనుబంధం ఉంది. మెగా కుటుంబంలోని ప్రతి ముఖ్యమైన వేడుకలో మెహర్ రమేష్ కీలక పాత్ర పోషిస్తుంటారు.
దర్శకుడిగా తన కెరీర్‌ను పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ శాఖలో ప్రారంభించిన మెహర్ రమేష్.. కన్నడలో ‘వీరకన్నడిగ’, ‘అజయ్’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ‘కంత్రి’, ‘బిల్లా’, ‘షాడో’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె వివాహ వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Megastar @KChiruTweets garu graced the wedding reception of Director #MeherRamesh ’s Daughter and blessed the couple ❤️#Chiranjeevi pic.twitter.com/8tomO6Ybxo
— Rishi (@Rishi_JanaSena) July 1, 2026