Bhola Shankar Movie | అనవసరంగా అజిత్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టారే..!
Meher Ramesh | కాలు జారితే పట్టుకోవచ్చు గానీ, మాట జారితే పట్టుకోగలమా అనే సామేత మెహర్ రమేష్‌కు బాగా సూటవుతుంది. ఇప్పుడున్న జమానాలో మాట జారితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా సినిమా వాళ్లు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది.
Meher Ramesh | కాలు జారితే పట్టుకోవచ్చు గానీ, మాట జారితే పట్టుకోగలమా అనే సామేత మెహర్ రమేష్‌కు బాగా సూటవుతుంది. ఇప్పుడున్న జమానాలో మాట జారితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా సినిమా వాళ్లు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అవడం పక్కా. ఇప్పటికే భోళా శంకర్ సినిమాపై వీర లెవల్లో నెగెటివిటీ ఏర్పడింది. సాంబార్ బ్యాచ్ ట్విట్టర్లో టీజర్, ట్రైలర్లపై బోలెడు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మెహర్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. మాములుగానే తమిళంలో ప్రాంతీయవాదం ఎక్కువ. పైగా అక్కడి హీరోలను అభిమానులు తెగ ఆరాధిస్తుంటారు.
అలాంటిది తమిళ్లో తిరుగులేని ఫ్యాన్స్ బేస్ ఉన్న అజిత్ సినిమాపైనే సెటైర్లు వేస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా. తాజాగా జరిగిన భోళా శంకర్ ప్రెస్మీట్లో మెహర్ రామేష్ మాట్లాడుతూ.. భోళా శంకర్ టీజర్, ట్రైలర్లు క్రింజ్‌గా ఉన్నాయని అంటున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ వేదాళంలో పదింతలు ఎక్కువ క్రింజ్ ఉంటుంది. కానీ నేను అదంతా తీయలేదు. ఒరిజినల్ కథకు చాలా మార్పులు చేర్పులు చేసి తన స్టైల్లో సినిమా చేశానని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడి వరకు ఒకే గానీ.. తమిళ జనాలకు మాత్రం అస్సలు రుచించదు. మన సినిమాను ఎంతైనా పొగుడుకోవచ్చు. కానీ వేరే సినిమాను తిట్టడం అనేది చేస్తే మట్టుకు అది చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు మెహర్ రమేస్ చేసిన కామెంట్స్ అదే దారిన వెళ్తున్నాయి.
మా హీరో సినిమాలను అలా ఎలా అంటారంటూ అజిత్ ఫ్యాన్స్ మెహర్ రమేష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత క్రింజ్‌గా ఉంటే రీమేక్ ఎలా చేశారు. మీ సినిమాలు ఎమైనా గొప్పగా ఉన్నాయా?. శక్తి, షాడో సినిమాల్లో ప్రతీ ఫ్రేమ్‌లో క్రింజ్ కనిపిస్తుందంటూ మెహర్ రమేష్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ తతంగం ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు కానీ.. ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్‌లో నడుస్తుంది. దానికి తోడు సొమవారం జరిగిన వీరయ్య రెండొందల రోజుల ఫంక్షన్లో చిరు చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. చిరును ఎంతో అభిమానించే పెర్ని నాని వంటి వారే ఇప్పుడు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇవన్నీ భోళా శంకర్‌పై ఏ రేంజ్లో ఎఫెక్ట్ చూపుతాయో అని మెగా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

