దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టూడెంట్’. బాలు తత్వమసి దర్శకుడు. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మేఘాంశ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ‘ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు’ అనే క్యాప్షన్ హీరో పాత్ర చిత్రణను ప్రతిబింబించేలా ఉంది.
కాలేజీ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరో మేఘాంశ్ విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని పోస్టర్‌ను చూస్తే అర్థమవుతున్నది. విజేత పరీక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రేమ్‌చంద్ కంచర్ల, రచన-దర్శకత్వం: బాలు తత్వమసి.