Megha Akash | ఆ రూల్స్ పాటించాల్సిందే.. రావణాసుర సినిమాపై మేఘా ఆకాశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘రావణాసుర’ చిత్రంలో ధనవంతురాలైన అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, వినోదంతో పాటు భిన్న భావోద్వేగాలతో తన పాత్ర సాగుతుందని చెప్పింది మేఘా ఆకాష్. రవితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
Megha Akash | ‘రావణాసుర’ చిత్రంలో ధనవంతురాలైన అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, వినోదంతో పాటు భిన్న భావోద్వేగాలతో తన పాత్ర సాగుతుందని చెప్పింది మేఘా ఆకాష్. రవితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన మేఘా ఆకాష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ బాగా నచ్చింది. అయితే కథ ఎక్కడా చెప్పొద్దని దర్శకుడు సుధీర్‌వర్మ మా టీం అందరికి ఓ రూల్ పెట్టాడు. అందుకే కథ గురించి ఏమాత్రం రివీల్ చేయడం లేదు.
ఈ సినిమాలో రవితేజ వంటి సీనియర్ నటుడితో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఈ కథలోని మలుపులు ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తాయి. అందరూ థ్రిల్ ఫీలవుతారు. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నా. విజయ్ ఆంటోనితో కలిసి ఓ సినిమా చేయబోతున్నా. మా అమ్మ నిర్మాణ భాగస్వామ్యంలో ఓ సినిమాకు సిద్ధమవుతున్నా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

