రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మాటే మంత్రము’ అనే టైటిల్ను ఖరారు చేశారు. హీరో రాహుల్ విజయ్ బర్త్డే సందర్భంగా మంగళవారం టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఏ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి కథను అందించగా.. అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెకుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…‘గోవా నేపథ్యంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. హైదరాబాద్, గోవా లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : హరి గౌర, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి.