Waltair Veerayya | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్
Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత అసలైన బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. విడుదలైన 8 రోజుల్లోనే ఈ సినిమా ఎకంగా రూ.104 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలైన కమ్ బ్యాక్ సినిమా ఇదే అంటూ అభిమానులు పండగ చేసుకున్నారు.
Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత అసలైన బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. విడుదలైన 8 రోజుల్లోనే ఈ సినిమా ఎకంగా రూ.104 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలైన కమ్ బ్యాక్ సినిమా ఇదే అంటూ అభిమానులు పండగ చేసుకున్నారు. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా అది కేవలం రీమేక్ సినిమా మాత్రమే. పైగా అందులో చిరంజీవి కాసేపు మాత్రమే కామెడీ చేస్తాడు.. మిగతాదంతా సోషల్ మెసేజ్ ఉంటుంది. కానీ వాల్తేరు వీరయ్యలో మాత్రం అలా కాదు ఎలాంటి సందేశాలు లేకుండా సినిమా అంతా ఫుల్ కమర్షియల్ క్యారెక్టర్లో కనిపించాడు. దాంతో ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు మెగా ఫాన్స్. ఇక ఈ సినిమా రీసెంట్గా కొన్ని సెంటర్లలో 250 రోజులు పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా థియేటర్ అనంతరం ఓటీటీలో కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలైన దాదాపు 10 నెలల తరువాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను మిస్సయిన వారి కోసం జెమినీ టీవీ శుభవార్త తెలిపింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 23న సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య జెమినీ టీవీలో ప్రీమియర్ కానున్నట్లు ప్రకటించింది. ఇక థియేటర్లలో, ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమా చూసే అవకాశం లేని వాళ్లు ఇక కుటుంబ సమేతంగా చూసేందుకు రెడీగా ఉండండి మరి.
World Television Premiere
Mega Mass Blockbuster #WaltairVeerayya October 23rd Monday at 6pm on #GeminiTV#Chiranjeevi #Raviteja #ShrutiHaasan #CatherineTresa #MegastarChiranjeevi pic.twitter.com/u4JBkrYGXm— Telugu TV Updates (@telugutvupdts) October 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

