ఓ పండగలా అనిపించింది
దర్శకుడు బాబీ కథ చెప్పినప్పుడే కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో ఊహించుకున్నా. ఆ సినిమాలో నాన్న ఓ జాలరి పాత్రలో కనిపిస్తారని..ఆయన్ని వింటేజ్ లుక్‌లో చూపించాలని బాబీ సూచించారు.
తెలుగు చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవి ధరించిన కాస్ట్యూమ్స్ ఆమె డిజైన్ చేసినవే. ఈ సందర్భంగా పాత్రికేయులతో మచ్చటించిన సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైన్ తాలూకు విశేషాల్ని పంచుకుంది.
దర్శకుడు బాబీ కథ చెప్పినప్పుడే కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో ఊహించుకున్నా. ఆ సినిమాలో నాన్న ఓ జాలరి పాత్రలో కనిపిస్తారని..ఆయన్ని వింటేజ్ లుక్‌లో చూపించాలని బాబీ సూచించారు. నాన్న సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి కాస్ట్యూమ్స్ విషయంలో పెద్దగా రీసెర్చ్ చేసే అవసరం రాలేదు. వింటేజ్ గ్యాంగ్‌లీడర్ తరహా లుక్‌లో ఆయన్ని చూపించాలని ప్రయత్నించాం. నాన్నగారు కూడా కొన్ని సలహాలిచ్చారు. మాస్ క్యారెక్టర్లో లుంగీ డిజైన్ ఎలా ఉండాలి? ఎలాంటి కళ్లజోడు అయితే బాగుంటుందనే విషయంలో నాన్న మంచి సూచనలు అందించారు.
ఓ పండగలా అనిపించింది
ఈ సినిమాలో నాన్న ధరించిన కాస్ట్యూమ్స్ వింటేజ్ లుక్‌తో పాటు నేటి ట్రెండ్‌కు తగినట్లుగా కనిపించాయి. ఇది పీరియాడిక్ సినిమా కాదు కాబట్టి వింటేజ్ లుక్ తీసుకొస్తూనే నేటి యువతకు నచ్చేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయనకు సూట్ అయ్యే షర్ట్స్‌ను ప్రత్యేకంగా తయారుచేయించాను. ఈ సినిమాలో నాన్నగారిని చూస్తున్నప్పుడు ఓ పండగలా అనిపించింది. ఈ తరహా పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు.
మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు
ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేవాళ్లకు కాస్ట్యూమ్స్ బాగా సూటవుతాయి. నాన్న ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి రోజు వర్కవుట్స్ చేస్తారు. ఈ సినిమాలో మరింత స్లిమ్‌గా కనిపించారాయన. దాంతో మేము డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఆయనకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి.
ఈ సినిమా చూసిన వారు నాన్న ఓ ఇరవై ఏళ్ల వయసు తగ్గి కనిపిస్తున్నారని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా చూశాం. అభిమానులతో పాటు ఈలలు వేస్తూ గోల చేశాం (నవ్వుతూ). కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రస్తుతం నేను ‘భోళా శంకర్’ చిత్రానికి పనిచేస్తున్నా. అలాగే రెండు వెబ్ సిరీస్‌లపై వర్క్ చేస్తున్నా. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూనే సినీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

