Megastar Chiranjeevi | ఈ విజయం మీకే అంకితం!.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్‌పై మెగాస్టార్ ఎమోషనల్ నోట్
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ "మన శంకరవరప్రసాద్ గారు" బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ “మన శంకరవరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్రం సాధించిన అపూర్వ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
మన శంకరవరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మిషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు.. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్ – మీ చిరంజీవి. అంటూ మెగాస్టార్ రాసుకోచ్చాడు.
From the heart,
with love & gratitude 🙏🏻 pic.twitter.com/LJ2g32x3qC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

