Vishwabhara | #mega156 టైటిల్ వచ్చేసింది.. వీడియో గ్లింప్స్‌తోనే అదరగొట్టిన వశిష్ట
Vishwabhara | చాలా ఏండ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సోషియోఫాంటసీ మూవీ చేస్తున్నాడు. బింబిసారతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vishwabhara | చాలా ఏండ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సోషియోఫాంటసీ మూవీ చేస్తున్నాడు. బింబిసారతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #mega156 సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపిస్తారా? అని మెగా ఫ్యాన్స్ ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్‌కు చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ యూవీ క్రియేషన్స్ ఒక వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.
చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో వస్తున్న #mega156 సినిమాకు ముల్లోక వీరుడు, విశ్వంభర టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి టైటిల్‌కు దగ్గరగా ఉండటంతో.. వీటిలో ముల్లోక వీరుడు అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ ఊహగానాలు అన్నింటినీ బ్రేక్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌ను రివీల్ చేసింది. విశ్వంభర టైటిల్‌ను కన్ఫార్మ్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కూడా ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.
స్వర్గపు అంచులను తాకుతూ వెళ్లిన ఒక మాయ పెట్టెలో.. కాలరంధ్రం గుండా పయనించి.. ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరకు భూమిపై వచ్చి చేరుతుంది. ఆ తర్వాత ఆ మాయ పేటిక ఓపెన్ అవ్వడంతో విశ్వంభర టైటిల్ రివీల్ అవుతుంది. ఈ క్రమంలో పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని చూపించడంతో సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ఈ టైటిల్ రివీల్ చేసి మెగా ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. టైటిల్ రివీల్నే ఈ రేంజ్లో ఉంటే.. సినిమా ఎలా ఉండబోతుందా? అని ఊహల్లో మునిగిపోతున్నారు. ఇక విశ్వంభర సినిమా విషయానికొస్తే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటిచనున్నారని ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

