Varun Tej | మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ (WW Gross) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సుదీర్ఘ విరామం తర్వాత వరుణ్ తేజ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోంది. అన్ని ప్రాంతాలలో విడుదలైన 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్ జోన్ చేరి ‘బ్రేక్ ఈవెన్ (Breakeven)’ సాధించడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
యూఎస్ (USA) వంటి ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ, హాఫ్ మిలియన్ ($500K) డాలర్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. వర్కింగ్ డేస్ లో సైతం నేడు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఇది బాక్సాఫీస్ వద్ద సుదీర్ఘ కాలం పాటు నిలకడగా కలెక్షన్లు రాబట్టే ‘లాంగ్ రన్ మూవీ’ అవుతుందని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తన మార్కెట్ స్టామినాను మరోసారి నిరూపించుకున్న వరుణ్ తేజ్ ఖాతాలో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.