waltair veerayya Trailer | వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే..
waltair veerayya Trailer | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాలా
waltair veerayya Trailer | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాలా ఏండ్ల తర్వాత సంక్రాంతికి పండక్కి వస్తుండటంతో బాస్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లుక్.. పాత చిరంజీవిని గుర్తుకు తెస్తున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. పైగా మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ క్రమంలో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్లో చిరంజీవి రెట్రో లుక్‌లో అదరగొట్టాడు. ఒకవైపు మాస్ యాక్షన్ స్టైల్ చూపిస్తూనే.. తన పాత స్టైల్ కామెడీతో అదరగొట్టాడు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన్ను చూసి.. రికార్డుల్లో పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉన్నాయనే డైలాగులు ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. రవితేజ, చిరంజీవి కాంబినేషన్లో సీన్స్‌కు విజిల్ పడటం పక్కా అన్నట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ ట్రైలర్‌ను చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం పక్కా అనే అంటున్నారు సినీ విశ్లేషకులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

