ఈ నెల 29 నుంచి మెగా ఎంట్రీ
‘విశ్వంభర’.. చిరంజీవి సినిమాకు ఈ టైటిల్ అనుకున్నప్పట్నుంచీ ఆ పేరుకు రకరకాల అర్థాలను ఆపాదిస్తూ వార్తలు వచ్చేస్తున్నాయి. అసలు ‘విశ్వంభర’ అంటే విశ్వాన్ని భరించేది.
‘విశ్వంభర’.. చిరంజీవి సినిమాకు ఈ టైటిల్ అనుకున్నప్పట్నుంచీ ఆ పేరుకు రకరకాల అర్థాలను ఆపాదిస్తూ వార్తలు వచ్చేస్తున్నాయి. అసలు ‘విశ్వంభర’ అంటే విశ్వాన్ని భరించేది. అనంతకోటి నక్షత్రాలు, అనేకానేక గోళాలు, అంతుచిక్కని రహస్యాల సమూహమే విశ్వం. అంతులేని ఈ విశ్వాన్ని భరించే శక్తిని ‘ఆది పరాశక్తి’ అంటారు. కాబట్టి ‘విశ్వంభర’ అంటే ఆదిపరాశక్తి అని అర్థం. పంచభూతాత్మకమైన ఈ పేరును సినిమాకు పెట్టిన దర్శకుడి గట్స్‌ని మెచ్చుకోవాలి.
ఈ సినిమా కథ విషయంలో అయిదు లోకాలు, అయిదుగురు హీరోయిన్లంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఫాంటసీ కథ అన్నది నిజం. మిగతా అంతా గాలివార్తలే. అయితే, ఇందులో రానా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పురాణాల్లోని రాక్షసులకు ఏ మాత్రం తీసిపోని క్రూరమైన పాత్రలో ఇందులో రానా కనిపించనున్నట్టు తెలిసింది. అలాగే అనుష్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.
ఈ నెల 23 నుంచి రెండురోజులపాటు మారేడుమిల్లి ఫారెస్ట్‌లో విలన్ ఎంట్రీకి సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. ఇందులో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకూ చిరంజీవి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. ఇదిలావుంటే.. ఈ నెల 29 నుంచి పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుకానుంది. ఈ షూటింగ్‌లోనే చిరంజీవి కూడా పాల్గొంటారు. మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

