Mega158 | మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ #Mega158 నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మెగాస్టార్‌పై నిర్వహించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మెగాస్టార్‌ను మరింత శక్తివంతమైన మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు స్పష్టం చేస్తూ, చిరంజీవి గారి ఫైనల్ లుక్ లాక్ అయిందని ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.
మరోవైపు గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి కేవీఎన్ ప్రొడక్షన్స్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, ఈ చిత్రాన్ని KVN Productions బ్యానర్‌పై లోహిత్ ఎన్.కె. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు యూనిట్ ధృవీకరించింది. మే నెలలో ఈ సినిమా గ్రాండ్ ముహూర్తం జరుపుకోనుండగా, అదే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి కెమెరా బాధ్యతలు చేపట్టారు. ఇక తారాగణం విషయానికి వస్తే, డింపుల్ హయతి కీలకమైన నెగటివ్ రోల్లో కనిపిస్తుందని, ప్రియమణి ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ‘కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
THE SILENCE BEFORE SLAUGHTER 🗡️🔥
Megastar @KChiruTweets gears up for #Mega158 as the look test has been completed, kickstarting a blockbuster journey💥#ChiruBobby2 Muhurtham & Regular shoot updates dropping soon 💥
Directed by @dirbobby
Produced by @KvnProductions… pic.twitter.com/CmVA1vL01e— Vamsi Kaka (@vamsikaka) April 28, 2026