బిగ్ బీ మనవరాలు నాకు ఫ్రెండ్ మాత్రమే..

సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి శృతి మించి ప్రచారాలు చేస్తుండడంతో సెలబ్స్ స్పందించక తప్పడం లేదు. కొన్నాళ్లుగాఅమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా, బాలీవుడ్ యువ నటుడు మీజాన్ జాఫేరీ ప్రేమలో ఉన్నట్టు జోరుగా ప్రచారం నడిచింది. అప్పట్లో ఈ విషయంపై స్పందించిన మీజాన్ తండ్రి జావేద్ మాట్లాడుతూ.. వారిద్దరు స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటికీ పలు మీడియా సంస్థలు వారిద్దరిని ప్రేమ పక్షులుగానే చెప్పుకొస్తున్న నేపథ్యంలో మీజాన్ మీడియాతో మాట్లాడాడు. నవ్వ నవేలి గురించి కొన్నాళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. మేమిద్దరం స్నేహితులం మాత్రమే. నా గురించి మాట్లాడిన ప్రతి సారి ఆమె పేరు ప్రస్తావన వస్తుంది. నవ్య నా సోదరికి కూడా బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటి సమయంలో వేరొకరి గురించి ఇష్టమొచ్చినట్లుగా కథనాలు అల్లేయడం ఏమీ బాగోలేదు. దీనివల్ల నేను నా ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. నా పేరెంట్స్ నా వైపు అదోలా చూస్తున్నారు. నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేను అంటూ మీజాన్ బల్ల గుద్ధి చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

