స్వీయ దర్శకత్వంలో కుప్పిల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మీలో ఒకడు’. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. హ్రితిక సింగ్, సాధన పవన్ కథానాయికలు. ఈ నెల 22న స్క్రీన్మ్యాక్స్ ప్చిక్చర్స్ థియేటర్లలో విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
సుమన్, కృష్ణభగవాన్, అశోక్ కుమార్ వంటి సీనియర్ నటులు సహకారం వల్ల సినిమా అనుకున్న విధంగా వచ్చింది’ అన్నారు. ఇండస్ట్రీకి కొత్తవాడైన కుప్పిలి శ్రీనివాస్ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ చక్కటి చిత్రాన్ని రూపొందించారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీను, సంగీతం: జయసూర్య, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కుప్పిలి శ్రీనివాస్.