Maya Petika OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే
Maya Petika OTT | ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్గా పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘మాయా పేటిక (Maya Petika). సిమ్రత్ కౌర్ (Simrat Kaur), సునీల్ (Sunil), శ్రీనివాసరెడ్డి, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ రాపార్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
Maya Petika OTT | ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్గా పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘మాయా పేటిక (Maya Petika). సిమ్రత్ కౌర్ (Simrat Kaur), సునీల్ (Sunil), శ్రీనివాసరెడ్డి, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ రాపార్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha)లో ‘మాయా పేటిక (Maya Petika) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన అ సినిమాను జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు.
కథలోకి వస్తే.. పాయల్ టాలీవుడ్లో ఓ స్టార్ట్ హీరోయిన్. ఆమెకి నిర్మాత సెల్‌ఫోన్‌ను కానుకగా ఇస్తాడు. అయితే ఆ ఫోన్ వల్ల పాయల్‌కు సమస్యలు వస్తాయి. దీంతో ఆ ఫోన్‌ను అసిస్టెంట్‌కు ఇస్తుంది. ఇక అక్కడ నుంచి ఆ ఫోన్ ఎంతోమంది దగ్గరకి మారుతూ ఉంటుంది. దీనితో ఆ ఫోన్ మారిన ప్రతి ఒక్కరితో ఏదొక సమస్య ఏర్పడుతుంది. మరి ఇంతకీ ఆ ఫోన్ ఏంటి? ఆ ఫోన్ మూలాన ఏం జరుగుతుంది? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ఓం క్లీం హ్రీం..!🤨
మాయాపేటిక తెరుచుకున్నది వీక్షించుము!!🤳#MayapetikaOnAHA Streaming Now▶️ https://t.co/wxIdUDh2Bc @ahavideoIN @Raparthy @THARAK369 @gunasekaran_gm @viraj_ashwin #Simratkaur @SyamalaOfficial @its_Himaja @Actorysr @suneeltollywood pic.twitter.com/pLdjICdm1J
— Vamsi Kaka (@vamsikaka) September 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

