March Second week Releases | అసలు సిసలైన సమ్మర్ మొదలైంది. వేసవి సెలవులను పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ హీట్‌లో కూల్‌గా కాస్త కంటెంట్ ఉన్న బొమ్మ పడితే బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టడం ఖాయం. గత రెండు నెలలుగా టాలీవుడ్లో ‘దసరా’, ‘విరూపాక్ష’ తప్పితే పెద్దగా రాణించిన సినిమాలే లేవు. గతవారం ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘ఉగ్రం’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నటన పరంగా నరేష్ వంద మార్కులు కొట్టేసిన.. దర్శకుడు మాత్రం బోటా బోటీ మార్కులతో సరిపెట్టుకున్నాడు. కలెక్షన్లు కూడా అబ్బో అనిపించే రేంజ్లో మాత్రం లేవు. ఇక ‘రామబాణం’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వారంలోపే దుకాణం సర్దేసింది. కొన్ని చోట్ల థియేటర్ రెంట్‌కు సరిపడా కలెక్షన్లు కూడా రావడం లేదని టాక్. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా సినీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ముస్తాబవుతున్నాయి. మరీ ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో ఓ లుక్కే్ద్ధాం.
థియేటర్లో రిలీజయ్యే సినిమాలు:
కస్టడీ:
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు అనుకునే లోపు థాంక్యూ ద్వారా మరో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకులు ముందుక రానుంది.
ఛత్రపతి:
పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ‘వర్షం’తో తొలి హిట్ అందుకున్న ప్రభాస్‌కు.. ఛత్రపతి తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్‌కు మాస్ ఆడియెన్స్ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డెబ్యూ ఇస్తున్నాడు. మాస్ సినిమాలకు పెట్టిన పేరైన వి.వి. వినాయక్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.\
భువన విజయం:
సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. యలమండ చరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి హైప్‌నే క్రియేట్ చేశాయి. వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర స్వరాలు సమకూర్చుతున్నాడు.
ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్:
నిహాల్ కొదాటి, దృషికా చందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రవిప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై కాస్త మంచి బజ్ తెచ్చిపెట్టింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
మ్యూజిక్ స్కూల్:
శ్రీయా శరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే 12న తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. దిల్‌రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమానకు పాపారావు బియ్యాల దర్శకత్వం వహించాడు.
వీటితో పాటు ‘కళ్యాణమస్తు‘ సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఆహా:
న్యూసెన్స్ (తెలుగు వెబ్ సిరీస్) – మే 12
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ద మప్పెట్స్ మేహం (హాలీవుడ్ సిరీస్) – మే 10
స్వప్న సుందరి (తెలుగు డబ్బింగ్) – మే 12
కార్టర్ (హాలీవుడ్) – మే 12
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఎయిర్ (హాలీవుడ్) – మే 12
దహాద్ (హిందీ సిరీస్) – మే 12
జీ-5:
తాజ్: రేన్ ఆఫ్ రివేంజ్ (హిందీ సిరీస్) – మే 12
నెట్ ఫ్లిక్స్:
క్వీన్ క్లియోపాత్ర (హాలీవుడ్ సిరీస్) – మే 10
రాయల్ టీన్: ప్రిన్సెస్ మార్గరెట్ (డానిష్) – మే 11
ద మదర్ (హాలీవుడ్) – మే 12
తిరువిన్ కురల్ (తమిళం) – మే 12
సోనీ లివ్:
ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్ (ఇంగ్లీష్) – మే 12
జియో సినిమా:
విక్రమ్ వేద(హిందీ) – మే 12