Abhinav Gomatam | టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!'(Masth Shades Unnai Ra) కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. గోదావరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ (అభినవ్ గోమఠం) అనే వ్యక్తి గొప్ప పెయింటర్ అవ్వాలని.. అలాగే తన ఊరిలోనే దానిపై మంచి బిజినెస్ పెట్టి లైఫ్ లో సెటిల్ అవుదామని కలలు గంటూ ఉంటాడు. ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి తన కి ఎలా సహాయపడింది. మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ ఏంటి? అసలు మనోహర్‌కు తాను కలలు గన్న జీవితం దొరుకుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి సమర్పణలో ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రచన & దర్శకత్వం: తిరుపతి రావు. నిర్మాతలు: ఆరెం రెడ్డి, ప్రశాంత్ వి, భవానీ కాసుల. SIC: సంజీవ్ట్ BGM: శామ్యూల్ ABY DOP: సిద్దార్థ స్వయంభూ ఎడిటర్: రవితేజ గిరిజాల. డైలాగ్స్: రాధా మోహన్ గుంటి ప్రొడక్షన్ డిజైనర్: శరవణన్ వసంత్. సాహిత్యం: కిట్టు విస్సప్రగడ. గాయకులు: SID శ్రీరామ్, హేమచంద్ర.