Mass Jathara | మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ (Mass Jathara). ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు అని తెలుస్తుంది. ‘ధమాకా’ వంటి బిగ్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
#MassJathara is certified with 𝐔/𝐀 🎬🔥
Mass, fun, and action… all in one! 💣
Experience the MASS WAVE of ENTERTAINMENT in theaters near you on Oct 31st! 💥🕺#MassJatharaOnOct31st
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/qH8AeyHa49
— Sithara Entertainments (@SitharaEnts) October 25, 2025