షూటింగ్ ఉంటే నాకు పండగ: హీరో రవితేజ
ఎనర్జీకి మారుపేరు రవితేజ. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాందించుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావు దర్శకుడు.
ఎనర్జీకి మారుపేరు రవితేజ. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాందించుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావు దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం రవితేజతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది.
సాధారణంగా ప్రమోషన్స్‌లో కనిపించని మీరు ‘ధమాకా’ విషయంలో ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు?
అలాంటిదేమీ లేదు. కొన్ని సినిమాలకు పబ్లిసిటీ ఐడియాల ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొంటాను. అప్పుడప్పుడు అభిమానులతో ప్రత్యేక ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. ఈ సినిమా విషయంలో అభిమానులను కలిశాను. వారితో గడపటం బాగా ఎంజాయ్ చేస్తాను.
సినిమా విడుదలకు ముందు.. తరువాత సినిమా రిజల్ట్ విషయంలో మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరెందుకని?
నాకు సినిమా గురించి మాట్లాడటం నచ్చదు. సినిమాలు మాట్లాడాలి.. సినిమా రిజల్ట్ మాట్లాడుతుందనేది నా నమ్మకం.
ధమాకా ఎలాంటి చిత్రం?
మంచి ఎంటర్టైనర్. ‘రాజా ది గ్రేట్’ తరువాత నా నుంచి వస్తు న్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ సినిమా ఇది. ఈ జోనర్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.
ఈ సినిమాను చిరంజీవి ‘రౌడీఅల్లుడు’తో పోలుస్తున్నారు?
తెలుగు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసింది చిరంజీవి, రాజేంద్రప్రసాద్. ఖచ్చితంగా ఇది అలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమానే. సందేహం లేదు.
కొత్త రచయితలకు అవకాశం ఇస్తున్నారు?
నేను మొదట్నుంచి కొత్త రచయితలతో పనిచేస్తుంటాను. ఒకప్పుడు నేను కొత్తవాడినే. వారిలో ప్రూవ్ చేసుకోవాలనే తపన ఉంటుంది. వీలున్నంత వరకు కొత్తవారితో పనిచేయడానికి ప్రయత్నిస్తాను.
పాండమిక్‌లో ఆడియన్స్ టేస్ట్ మారిందని అంటున్నారు? సినిమాల ఎంపిక విషయంలో మీ అభిరుచి మారిందా?
నాకు తెలిసి కొత్త కథలు ఏమీ ఉండవు. ఉన్న కథల్లోనే ప్రజంటేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మేము చేసే ప్రతి సినిమాకు కేర్ తీసుకుంటాం. కొన్ని సార్లు జనాలు కనెక్ట్ అవుతారు. కొన్ని సార్లు కనెక్ట్ అవ్వరు. ఇక నాకు కథల ఎంపికలో వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఏమీ ఉండవు. కథ నచ్చితే ఒప్పుకుంటాను.
కథ నచ్చకపోయినా కాంబినేషన్ సెటప్ చూసి సినిమా చేస్తారా?
దర్శకుడి కోసం, కాంబినేషన్ కోసం నేను సినిమా చేయను. కథ నచ్చాలి..నేను కాదు ఇంకెవరూ చేయరు.
ప్రేక్షకులు ఓటీటీ సినిమాలకు అలవాటు పడ్డారు? ఈ విషయంలో మీ మైండ్‌సెట్ మారిందా?
ఓటీటీ కంటెంట్ వేరు. బిగ్‌స్క్రీన్ కంటెంట్ వేరు. ఖచ్చితంగా ఆ ప్రభావం నా మీద ఉండదు.
చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’లో నటిస్తున్నారు? ఆ పాత్ర ఎలా వుంటుంది?
నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు మొదట్నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్.
ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి?
ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం కుదరదు. యూనిక్‌గా కనెక్ట్ అయ్యే కథ ఉంటే ఆ కథ సినిమాని ఆ స్థాయికి తీసుకువెళ్తుంది.
వరుసగా సినిమాలు చేస్తున్నారు? రిస్క్ అనిపించటం లేదా?
పనిచేయడం నాకు ఇష్టం. షూటింగ్ ఉంటే నాకు పండుగ. నాకు ఏ రోజు బోర్ కొట్టదు. బోర్ అనే పదం నా డిక్షనరీలో లేదు. ఉన్నదాంట్లో హ్యాపీగా వుండాలి అదే నా సూత్రం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

