Maruthi Nagar Subramanyam Trailer | మారుతి నగర్ సుబ్రమణ్యం ఏజ్‌బార్ కష్టాలు!
క్యారెక్టర్ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా మారిపోయాడు.. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాన్ ఇండియా దర్శకుడు తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ కథానాయకుడు రామ్‌చరణ్ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
క్యారెక్టర్ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా మారిపోయాడు.. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాన్ ఇండియా దర్శకుడు తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ కథానాయకుడు రామ్‌చరణ్ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రంలో రావు రమేష్ తండ్రి పాత్రలో నటించినట్టుగా కనిపిస్తుంది.
ట్రైలర్లో మారుతి నగర్ వాసి సుబ్రహ్మణ్యానికి ఎటకారం ఎక్కువ అని తెలుస్తుంది. ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి ‘పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది’ అని అడిగితే గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను’ అని చెబుతాడు. టైటిల్ రోల్ రావు రమేష్ చేయగా ఆయన భార్యగా ఇంద్రజ కనిపించారు. భర్త సిగరెట్లకు భార్య డబ్బులు ఇస్తోందని ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వను అని ఇంద్రజ డైలాగ్ చెప్పడంతో అర్థం అవుతుంది. ఆ వెంటనే నీకు అదృష్టం ఆవగింజ అంత ఉంటే దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు అని అన్నపూర్ణమ్మ చెప్పారు.
ఆవిడ రావు రమేష్ అత్తగారి పాత్ర చేశారు. సుబ్రమణ్యం కుమారుడు ఏమో ‘మా నాన్న అల్లు అరవింద్’ అని గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేశాడు ఇలా ట్రైలర్ ఫన్‌గా కొనసాగింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆగస్టు 23న విడుదల చేస్తుంది. దర్శకుడు మాట్లాడుతూ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఆ కంటెంట్ ఒక ఎత్తు అయితే… రావు రమేష్ నటన మరొక ఎత్తు. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో జీవించారు. ‘అవన్నీ ఓకే’ అని డైలాగ్ చెప్పడంలో, నుదుట నామాలు పెట్టి కుర్చీ తీసిన సన్నివేశంలో ఆయన చూపించిన యాటిట్యూడ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. డైలాగులు బావున్నాయి. సినిమాపై ఈ ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచింది’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

