Martin Luther King | హృదయ కాలేయం (Hrudaya Kaleyam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలచుకున్నాడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). ఆయన నటించిన తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). తమిళ నటుడు యోగిబాబు (Yogi babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా (Mandela 2021) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను తమిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించగా.. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు (Pooja Aprna Kolluru) దర్శకత్వం వహించింది. ఇక దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా ఇది. అక్టోబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో సంపూ యాక్టింగ్ హైలెట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీలివ్’ లో ఈ నెల 29 నుంచి ‘మార్టిన్ లూథర్ కింగ్ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా (Venkatesh Maha) క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.