Martin Luther King | ఆసక్తికరంగా సంపూర్ణేష్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్
Martin Luther King Teaser | హృదయ కాలేయం (Hrudaya Kaleyam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలచుకున్నాడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). తనకంటూ ప్రత్యేక ట్రాక్ సెట్ చేసుకొని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Martin Luther King Teaser | హృదయ కాలేయం (Hrudaya Kaleyam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలచుకున్నాడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). తనకంటూ ప్రత్యేక ట్రాక్ సెట్ చేసుకొని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). తమిళ నటుడు యోగిబాబు (Yogi babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా (Mandela 2021) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను తమిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించగా.. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు (Pooja Aprna Kolluru) దర్శకత్వం వహిస్తుంది. ఇక దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ గమనిస్తే.. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఓ బార్బర్ ఓటుకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు జరిగాయి అనేదే సినిమా కథ. ఇక ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఇందులో తమిళంలో యోగిబాబు పోషించిన పాత్రను తెలుగులో సంపూర్ణేష్ బాబు చేస్తున్నాడు. నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
#MartinLutherKing Teaser –https://t.co/qw57MTYsfX#MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/KAvxaZKY8M
— Sampoornesh Babu (@sampoornesh) October 2, 2023
వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తుండగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా (Venkatesh Maha) క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

