Mark Antony | మార్క్ అంథోని ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే..!
Mark Antony Movie Trailer | తెలుగు మూలాలుండటంతో తమిళ హీరో విశాల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. భరణి, పందెం కోడి, అభిమన్యుడు వంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రేంజ్లో లాభాలు తెచ్చిపెట్టాయి.
Mark Antony Movie Trailer | తెలుగు మూలాలుండటంతో తమిళ హీరో విశాల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. భరణి, పందెం కోడి, అభిమన్యుడు వంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రేంజ్లో లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో విశాల్ నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ సినిమా రాలేదు. కొన్ని సినిమాలైతే ఎప్పుడు రిలీజయ్యాయో కూడా తెలియకుండా వచ్చేశాయి. కాగా ఇప్పుడొస్తున్న మార్క్ అంథోని సినిమా గురించి మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో కాస్త మంచి హైపే ఉంది. దానికి తోడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను వెల్లడించారు.
కాగా మార్క్ అంథోని ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. చుట్టూ పేలుతున్న తుపాకుల మధ్యలో సిగరెట్ కాల్చుతూ రాజసం ఉట్టిపడేలా ఉన్న పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా నాలుగు రోజుల ముందే సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అదే రోజున మరో అరవ సినిమా చంద్రముఖి-2, తెలుగు సినిమా స్కందలు రిలీజ్ కాబోతున్నాయి. తెలుగునాట స్కందపై ఓ మోస్తరు బజ్ ఉన్నా.. చంద్రముఖి సీక్వెల్‌పై పెద్దగా అంచనాల్లేవు.
అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మార్క్ ఆంటోని సినిమాను మినీ స్టూడీయోస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్‌కు జోడీగా రీతూవర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
#MarkAntony Trailer on September 3rd !#MarkAntonyFromSep15#MarkAntonyTrailer pic.twitter.com/YWhLBiLbdV
— Vishal (@VishalKOfficial) September 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

