Mark Antony Movie | టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మార్క్ ఆంటోని ట్రైలర్.. విశాల్ ఈ సారి కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నాడు..!
Mark Antony Movie Trailer | కోలివుడ్ హీరో విశాల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. పైగా తెలుగు మూలాలున్న నటుడు కావడవంతో ఇక్కడి ప్రేక్షకుల ఆయన సినిమాలను తెగ ఆదరిస్తుంటారు. పందెం కోడి, భరణి, పొగరు, అభిమన్యుడు వంటి సినిమాలు ఇక్కడ కూడా బంపర్ హిట్టయ్యాయి.
Mark Antony Movie Trailer | కోలివుడ్ హీరో విశాల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. పైగా తెలుగు మూలాలున్న నటుడు కావడవంతో ఇక్కడి ప్రేక్షకుల ఆయన సినిమాలను తెగ ఆదరిస్తుంటారు. పందెం కోడి, భరణి, పొగరు, అభిమన్యుడు వంటి సినిమాలు ఇక్కడ కూడా బంపర్ హిట్టయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా విశాల్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. నిజానికి ఐదేళ్ల క్రితం వచ్చిన ‘అభిమాన్యుడు’ తర్వాత ఇప్పటివరకు విశాల్‌కు మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘మార్క్ ఆంటోని’ సినిమాపైనే ఉన్నాయి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.
ట్రైలర్‌తో సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్నేళ్ల కిందట రూత్ లెస్ గ్యాంగ్స్టర్లుగా మాఫియా రారాజులుగా ఎదిగిన ప్రాణ స్నేహితులు విశాల్, ఎస్ జే సూర్యలు భిన్న గెటప్‌లు ధరిస్తూ శత్రువులను ముప్పు తిప్పలు పెడుతుంటారు. అందరినీ వాళ్ల గుప్పెట్లో ఉంచుకోవాలని కర్కోసంగా ప్రవర్తిస్తంటారు. కాగా వర్దమానంలో మరో విశాల్ వీళ్లను ఫోన్ ద్వారా కలుసుకునే టైం మెషీన్‌ని చూస్తాడు. ఆ టైమ్ మిషిన్ సహాయంతో వాళ్ళను కలుసుకుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. వీళ్లు రాక్షసులు అని తెలుసుకుని వాళ్లతో తలపడడానికి సిద్దం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. ట్రైలర్ కాస్త గజిబిజీగా ఉన్నా.. ప్రతీ షాట్ ఆసక్తికరంగానే అనిపించింది.
చాలా ఏళ్ల తర్వాత విశాల్ నుంచి ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ సినిమా వస్తుంది. గ్యాంగ్స్టర్లు, గొడవలు అంటే ఇదేదో యాక్షన్ సినిమా అనుకునేరు. ఇదే కాన్సెప్ట్‌కు హాస్యాన్ని పుష్కలంగా దట్టించారు. చూస్తుంటే ఈ సారి విశాల్ వీర లెవల్ కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా 80’ల పీరియడ్‌లో ఉన్న కాస్ట్యూమ్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. సునీల్‌కు మంచి క్యారెక్టర్ పడ్డట్లు తెలుస్తుంది. సెల్వా రాఘవన్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. జీ.వి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్లో అనిపించింది. విశాల్‌కు జోడీగా రీతూవర్మ, అభినయలు నటిస్తున్నారు. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

