Mark Antony Movie | మార్క్ ఆంటోని రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?
Mark Antony Movie Release Date | విశాల్ హిట్టు చూసి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో ఐదేళ్ల కింద వచ్చిన అభిమన్యుడు తర్వాత ఇప్పటివరకు విశాల్‌కు మరో హిట్టు లేదు. అభిమన్యుడు తర్వాత విడుదలైన ఏడు సినిమాలు డిజాస్టర్లుగానే మిగిలాయి.
Mark Antony Movie Release Date | విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్లో కలెక్షన్లు వస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా విశాల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. 2018లో వచ్చిన అభిమన్యుడు తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్టు లేదు. ప్రస్తుతం విశాల్ మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో మార్క్ ఆంటోని ఒకటి. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై మంచి హైప్‌నే తెచ్చిపెట్టాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మార్క్ ఆంథోని సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలను ఒకే ఫ్రేమ్‌లో ఫోటోలో చూపించారు. ఎస్.జే సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మినీ స్టూడీయోస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మేకర్స్ రూపొందించనున్నారు.
#MarkAntony Vinayagar chaturthi release da mamae @iam_SJSuryah Naa Ready Dha Varava?? pic.twitter.com/5NjfKawLLZ
— Vishal (@VishalKOfficial) July 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

