Mark Antony | మార్క్ ఆంటోనీ నటుడిగా నాకు నెక్ట్స్ లెవల్ సినిమా : విశాల్
Mark Antony | విశాల్ (Vishal) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చేసిన చిట్‌చాట్ సెషన్లో పలు విషయాలు అందరితో పంచుకున్నాడు విశాల్.
Mark Antony | తెలుగు, తమిళం ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అక్కర్లేని యాక్టర్ విశాల్ (Vishal). ఈ టాలెంటెడ్ హీరో కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చేసిన చిట్‌చాట్ సెషన్లో పలు విషయాలు అందరితో పంచుకున్నాడు విశాల్.
‘ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకమని తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇప్పటిదాకా డిఫరెంట్ జోనర్లలో వచ్చిన సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించా. ప్రేక్షకులు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేశారు. కేవలం వారి ప్రోత్సాహం వల్లే ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నా. అభిమానులు నాపై చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. మార్క్ ఆంటోనీ నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ నటుడిగా నాకు నెక్ట్స్ లెవల్ సినిమా ఇది. ఇందులో రెండు డిఫరెంట్ రోల్స్ చేశా. ఈ రెండు పాత్రలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. జీవీ సంగీతంతోపాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కన్నన్, దినేశ్ సుబ్బరాయన్ ఫైట్స్ సినిమాకు మెయిన్ హైలెట్‌గా ఉండబోతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మార్క్ ఆంటోనీ భిన్నమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని పక్కా చెప్పగలను. మీ ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగిస్తే.. ఇలా సినిమాలతో మిమ్మల్ని మరింతగా ఎంటర్టైన్ చేస్తానని చెప్పుకొచ్చాడు’ విశాల్.
ఇప్పటికే విడుదల చేసిన మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్స్‌తోపాటు టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశాల్ దీంతోపాటు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. అంతేకాకుండా విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

