Anupama Parameswaran | టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ అశ్విన్, స్టార్ హీరోయిన్లు రెజీనా కాసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మరీచిక’ (Mareechika). సతీష్ కాసెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా చిలకా ప్రోడక్షన్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, మేఘన చిలకా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సస్పెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘మ్యూజికల్ మాస్ట్రో’ ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం అందించడం విశేషం. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అద్భుతమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 29న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.