నరేష్, నాగమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘మారణహోమం 1990s’. ఎస్కేఎస్ ఫిల్మ్స్ పతాకంపై బంధు నరేష్ దర్శకత్వంలో నాగమణి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్‌ను సీనియర్ హీరో శ్రీకాంత్ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు.
1990 దశకం నేపథ్యంలో జరిగే కథ ఇదని, ఆసక్తికరమైన కథ, కథనాలతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. షూటింగ్ పూర్తయిందని, త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. దీప్తిరెడ్డి, లౌక్య, భాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నవనీత్‌చారి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బంధు నరేష్.