Manoj Bajpayee | షారుఖ్ కంటే నేషనల్ అవార్డు నాకు రావాల్సింది.. అభిమానుల వాదనపై స్పందించిన మనోజ్ బాజ్‌పాయ్
Manoj Bajpayee | ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డులలో బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్‌కి ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు.
Manoj Bajpayee | ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డులలో బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోబోతున్నాడు. అయితే షారుఖ్‌కి ఈ అవార్డు రావడంపై అనేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు షారుఖ్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతుంటే.. మరోవైపు కొంతమంది సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఈ అవార్డు షారుఖ్‌కి రావాల్సింది కాదని.. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్ నటనకు ఈ అవార్డు దక్కాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్
షారుఖ్ ఖాన్ కంటే తనకు జాతీయ అవార్డు వస్తే సంతోషించే వాళ్లం అని అభిమానులు అనడంపై మనోజ్ స్పందిస్తూ.. ఇది ఒక అనవసరమైన చర్చగా.. చెత్త సంభాషణగా అభివర్ణించారు. నేషనల్ అవార్డు విషయం ఇప్పటికే జరిగిపోయిందని దానిని వదిలేయడం మంచిదని అన్నారు. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’, ‘జోరామ్’ చిత్రాలు తన కెరీర్లో అత్యంత ముఖ్యమైనవి అని కానీ అవార్డు రాకపోతే భాదపడేవాడిని కాదని మనోజ్ తెలిపాడు.
అంతేగాకుండా నేషనల్ అవార్డుల గురించి మనోజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ అవార్డులతో సహా అనేక అవార్డులు వాటి ప్రాధాన్యతను కోల్పోతున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అవార్డులు కళాత్మక విలువకు బదులుగా వాణిజ్యపరమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మనోజ్ విమర్శించారు. ఒక నటుడిగా తనకు ఉన్న గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని అవార్డులు అనేవి కేవలం ఇంటిని అలంకరించే వస్తువులు మాత్రమేనని వాటిని తాను అంత సీరియస్‌గా తీసుకోనని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

