Bhaiyya Ji | బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి (Manoj Bajpayee) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భయ్యాజీ’ (Bhaiyaaji). ఈ సినిమాకు ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (Sirf Ek Bandaa Kaafi Hai)’ ఫేమ్ అపూర్వ సింగ్ కర్కి (Apoorv Singh Karki) దర్శకత్వం వహిస్తుండగా.. సువీందర్ విక్కీ, జతిన్ గోస్వామి, విపిన్ శర్మ, జోయా హుస్సేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. డాన్ లుక్‌లో మనోజ్ ఆకట్టుకున్నాడు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. లోకల్ డాన్‌గా మనోజ్ కనిపించనున్నాడు. భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, SSO ప్రొడక్షన్స్ & ఔరేగా స్టూడియోస్ బ్యానర్లపై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్, మనోజ్ బాజ్‌పాయి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం మనోజ్ బాజ్‌పాయి కెరీర్లో 100వ చిత్రం కావడం విశేషం.