ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ ఇదే
మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్'. దాదాపుగా 200కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందీ సినిమా. స్టార్స్ లేకుండా ఇన్ని వసూళ్లను రాబట్టడం నిజంగా చరిత్ర.
మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’. దాదాపుగా 200కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందీ సినిమా. స్టార్స్ లేకుండా ఇన్ని వసూళ్లను రాబట్టడం నిజంగా చరిత్ర. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధానపాత్రధారులు.
చిదంబరం ఎస్.పొదువల్ దర్శకుడు. పరవ ఫిలింస్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ నెల 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్‌తో పాటు నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శశిధర్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి అతిథులుగా హాజరై సినిమా తెలుగులో కూడా అఖండ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ మధ్య కాలంలో తాను చూసిన బెస్ట్ ఫిల్మ్ ఇదే నని, తెలుగులో కూడా పెద్ద విజయం సాధించడం పక్కా అని నిర్మాతల్లో ఒకరైన నవీన్ యర్నేని నమ్మకం వ్యక్తం చేశారు. తమకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ దర్శకుడు చిదంబరం కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

