Kriti Shetty rumours | పుకార్లపై కృతిశెట్టి అప్సెట్..ఇంతకీ ఏంటీ సంగతి?
ఉప్పెన (Uppena) ఇచ్చిన ఒక్క బ్రేక్‌తో బ్యాక్ టు బ్యాక్ కృతిశెట్టి (Kriti Shetty) ఖాతాలో పడిపోయాయి. ఇటీవలే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో అలరించింది కృతి శెట్టి.
తొలి సినిమా ఉప్పెన (Uppena) ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకుంటుందని కృతిశెట్టి కూడా ఊహించి ఉండదు. ఈ మూవీ ఇచ్చిన ఒక్క బ్రేక్‌తో బ్యాక్ టు బ్యాక్ కృతిశెట్టి (Kriti Shetty) ఖాతాలో పడిపోయాయి. ఇటీవలే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో అలరించింది కృతి శెట్టి. అంతేకాదు మరో మూడు సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మంగళూరు భామపై ఓ పుకారు ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. ఇంతకీ ఏంటా పుకారనుకుంటున్నారా..? కృతి శెట్టికి క్రమశిక్షణ తక్కువని, సెట్స్ కు నిర్దేశించిన టైంలోపల రాదని అపవాదు ఉంది.
అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ కు సంబంధించిన ప్రెషర్‌ను సెట్స్ లో చూపిస్తుందని, కోస్టార్ల పట్ల అమర్యాదగా ఉంటుందనే గాసిప్ కూడా ఉంది. నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. అయితే ఈ వార్తలు నిజమా..? కాదా పక్కన పెడితే ఈ గాసిప్స్ తో కృతిశెట్టి చాలా అప్ సెట్ అవుతుందట. ఈ పుకార్లను కొట్టిపారేస్తూ క్లారిటీ ఇచ్చే విషయంపై తన పీఆర్ టీం, మేనేజర్‌తో మాట్లాడగా..ఇలాంటి వార్తలపై మౌనంగా ఉండాలని కృతిశెట్టికి సూచించినట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే మరోవైపు కొంతమంది ఇన్ సైడర్లు మాత్రం కృతిశెట్టి లాంటి యంగ్ హీరోయిన్ సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి పుకార్త పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.మరి ఈ సలహాలు స్వీకరించి కృతిశెట్టి ఏవైనా మార్పులుంటే చేసుకోవాలని ఆశిస్తున్నారు మూవీ లవర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

