Mangalaavaram OTT | ఓటీటీలోకి రాబోతున్న ‘మంగళవారం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Mangalaavaram OTT | టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మంగళవారం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు
Mangalaavaram OTT | టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మంగళవారం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా డైరెక్షన్ పరంగా అజయ్ భూపతికి మంచి మార్కులు పడ్డాయి. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై డిస్నీ నిర్వహకులు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజునే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
#Mangalavaaram Coming Soon !
In Telugu, Tamil, Malayalam, Kannada. pic.twitter.com/Jyauzz7wEd
— OTT Gate (@OTTGate) December 14, 2023
ఈ సినిమా కథలోకి వెళితే.. ఒక ఊర్లో ప్రతి మంగళవారం అక్రమసంబంధం కలిగివున్న జంట భయంకరంగా హత్యకు గురవుతుంటారు. వారి బండారాన్ని ఓ అగంతకుడు ఊళ్లో ఏదో ఒక గోడమీద రాసి ఆ జంటను చంపుతుంటాడు. ఆ మిస్టరీని ఛేదించటానికి లేడీ ఎస్ఐ రంగంలోకి దిగుతుంది. కానీ ఊరు సహకరించదు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోటానికి ఊరుఊరూ నడుంబిగించి రాత్రుళ్లు వెతకడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ ఊరుకి సంబంధించిన ఓ కుర్రాడు గోడమీద రాస్తూ ఊరిజనానికి దొరికిపోతాడు. వాడ్ని తన్నీ స్టేషన్‌కి అప్పజెబుతారు. అయితే, మరణించిన శవాల పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం చంపింది ఆ దొరికిన కుర్రాడు కాదు. దాంతో అతడ్ని పోలీసులు వదిలేస్తారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఏంటి? ఎవరు చంపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

